తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, తాము బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని.. ప్రతిపక్ష తెలుగుదేశం ప్రకటించింది. ఈ ఎన్నికలతో వైకాపా పతనం ప్రారంభమైందని.. తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా, అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. వైకాపా కంటే కొంతమేర తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ.. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులను ఎదుర్కొని నిలబడినందున నైతిక విజయం తమదేనని అన్నారు. పల్లెపోరులో విజయాన్ని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సంబరాలు నిర్వహించారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.
తొలి దశ ఎన్నికల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు: దేవినేని ఉమా - devineni uma latest news
తొలి దశ ఎన్నికల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారని దేవినేని ఉమా అన్నారు. ఈ ఎన్నికలతో వైకాపా పతనం ప్రారంభమైందన్నారు. పల్లెపోరులో విజయాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ భవన్‌లో సంబరాలు నిర్వహించారు.
తొలి దశ ఎన్నికల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు: దేవినేని ఉమా