TDP Anitha on Chittor woman Case : రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని తెదేపా మహిళా పార్టీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. చిత్తూరు దళిత మహిళ ఉమామహేశ్వరిని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవయ్యిందని మండిపడ్డారు. చేయని దొంగతనాన్ని ఆమెపై వేసి రెండు రోజులపాటు స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా విస్మరించారని అనిత విమర్శించారు.
TDP Anitha on Chittor woman Case : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యింది -వంగలపూడి అనిత - TDP Anitha on Chittor woman Case
TDP Anitha on Chittor woman Case : రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని తెదేపా మహిళా పార్టీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యింది -వంగలపూడి అనిత