ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రోజా భ్రమలో ఉంది..చంద్రబాబును తిడితే మంత్రి పదవి వస్తుందా ?' - రోజాపై వంగలపూడి అనిత కామెంట్స్

వచ్చే భోగిలో వైకాపా చెత్త పాలనను తగులబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశాన్ని రోజా చంద్రబాబుపై చూపిస్తోందని విమర్శించారు.

tdp anitha fire on mla roja
రోజాపై మండిపడ్డ అనిత

By

Published : Jan 13, 2021, 4:54 PM IST

వచ్చే భోగిలో వైకాపా చెత్త పాలనను తగులబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. వైకాపా చేతిలో మోసపోయిన ప్రజలకు పండగ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. జగన్ మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశాన్ని రోజా చంద్రబాబుపై చూపిస్తోందని విమర్శించారు.

రోజాపై మండిపడ్డ అనిత

రైతులకు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇష్టానుసారం మాట్లాడటానికి సిగ్గుగా లేదా? అని మండిపడ్డారు. పేదలకు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదో సీఎం జగన్​ను అడిగే ధైర్యం రోజాకు ఉందా అని నిలదీశారు. చంద్రబాబును తిడితే మంత్రి పదవి వస్తుందనే భ్రమలో రోజా ఉందని అనిత విమర్శించారు.

ఇదీచదవండి:రైతన్నలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రైతు భోగి కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details