ఉన్నత స్థాయి కమిటీ ఎందుకు అన్నిసార్లు భేటీ అవుతుందో చెప్పాలని తెదేపా మాజీఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఉద్యమం చేస్తున్న రైతుల కులం ఎందుకు అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. కేసుల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తే... మహిళలు తిరగబడతారని హెచ్చరించారు. 144 సెక్షన్ పేరుతో జాతీయ మహిళా కమిషన్ సభ్యులను రాజధానిలో సరిగా తిరగనివ్వలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ సభ్యులు మరోసారి ఆంధ్రాలో పర్యటించాలని వంగలపూడి అనిత కోరారు. హోంమంత్రి హైపవర్ కమిటీలో తప్ప బయట కనిపించడంలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్-జగన్ భేటీ తర్వాత రాష్ట్రం ఎటు వెళుతుందోనని భయంగా ఉందన్నారు.
'భూములను ఆడపిల్లల్లా కాపాడుకోవాల్సి వస్తోంది' - ex mla vangalapudi anitha about ysrcp govt news
జనాల మధ్యకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారని... మాజీఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. హైపవర్ కమిటీల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
!['భూములను ఆడపిల్లల్లా కాపాడుకోవాల్సి వస్తోంది'](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
'ఆడపిల్లల్లా భూములను కాపాడుకోవాల్సి వస్తోంది'