తెదేపా నేత అచ్చెన్నాయుడి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమానుషంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. అర్థరాత్రి హైడ్రామా వెనుక ఏం కుట్ర ఉందని ప్రశ్నించారు. అచ్చెన్నను బలవంతంగా డిశ్చార్జ్ చేయాలనుకోవడం ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనన్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సిఫార్సు చేసినా, అవసరమైన మేర రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించినా.. లెక్కచేయకుండా అర్ధరాత్రి వేళ బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించారని విమర్శించారు.
'అర్ధరాత్రి హైడ్రామా వెనుక ఏం కుట్ర చేశారు?' - వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత బాల వీరాంజనేయస్వామి విమర్శలు
తెదేపా నేత అచ్చెన్నాయుడి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. అచ్చెన్నను బలవంతంగా డిశ్చార్జ్ చేయాలనుకోవడం కోర్టు ధిక్కారమేనన్నారు.

బాల వీరాంజనేయస్వామి, తెదేపా నేత