రేపు అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. మండలి రద్దు అంశం, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. తమ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తోందని తెదేపా ఆరోపిస్తుంది. ఇప్పటికే.. టీడీఎల్పీ భేటీకి రాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు సమాచారమిచ్చారు.
ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ వ్యక్తిగత కారణాలతో టీడీఎల్పీ సమావేశానికి రాలేమని తెలిపారు. పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతున్నారు. మండలిలో తెదేపాకు 32 మంది సభ్యులున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. రాజీనామా ప్రకటనతో సభకు ఎమ్మెల్సీ డొక్కా గైర్హాజరవుతారు.
'మా ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు వైకాపా యత్నిస్తోంది' - తెదేపా టీడీఎల్పీ సమావేశం ప్రారంభం న్యూస్
తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై నేతలు చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు.
tdlp meeting start
ఇదీ చదవండి:
TAGGED:
tdlp meeting start news