కరోనా విపత్కర పరిస్థితుల్లో జగన్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పండిన పంటలు పొలంలోనే ఉండిపోయి రైతులు దిగులు చెందుతుంటే...మీ భూములు స్వాధీనం చేసుకుంటామని వారికి నోటీసులు పంపించటమేంటని నిలదీశారు. నోటీసులు పట్టుకొని రైతులు రోడ్డుమీదకు వస్తే లాక్డౌన్ ఉల్లంఘన అంటూ వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రైతు కుంటుబాలను హింసించటం జగన్కు తగదని రామానాయుడు హితవు పలికారు.
'రైతు కుటుంబాలను హింసించటం తగదు' - ప్రభుత్వంపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు వ్యాఖ్యలు
జగన్ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ వైపు వారు కరోనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే..మరోవైపు మీ భూములు స్వాధీనం చేసుకుంటామని నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు.
టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామనాయుడు