ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్ అవసరానికి వాడుకుంటారు.. తర్వాత వదిలేస్తారు'

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. అవసరానికి తనను నమ్ముకున్న వాళ్లను వాడుకుని.. తర్వాత వారి మానాన వారిని వదిలేస్తారని విమర్శించారు. అజేయ కల్లం, పీవీ రమేశ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం వీళ్లందరూ ఆ జాబితాలోని వారేనన్నారు.

tdjp leader varla ramaiah criticises cm jagan
వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

By

Published : Jul 11, 2020, 11:36 AM IST

వర్ల రామయ్య ట్వీట్

ముఖ్యమంత్రి జగన్ తనను నమ్ముకున్న వాళ్లను అవసరానికి వాడుకుని అనంతరం వదిలేశారంటూ.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. తన కోసం పార్లమెంట్ సీటు త్యాగం చేసిన బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదాసీనత చూపారని ఆరోపించారు.

జగన్ సీఎం కావాలని ఆశపడిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అగౌరవ నిష్క్రమణ ఎదురైందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రత్యర్థులను సాధించాలనుకున్న అజేయ కల్లం, పీవీ రమేశ్​కు ఆశాభంగం కలిగిందని వర్ల ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details