శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం ప్రాజెక్టు కన్సల్టెంటుగా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ బిడ్ను దక్కించుకుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు కన్సల్టెంట్ ఫీజుగా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థకు 33 కోట్ల 22 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు చెల్లిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
భావనపాడు పోర్టు కన్సల్టెంటుగా టాటా ఇంజినీర్స్ లిమిటెడ్ - భావనపాడు పోర్టు ప్రాజెక్టు కన్సల్టెంటు
టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం ప్రాజెక్టు కన్సల్టెంట్ బిడ్ను దక్కించుకుంది. ప్రాజెక్టు కన్సల్టెంట్ ఫీజుగా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థకు 33 కోట్ల 22 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్