విజయవాడ పంజా సెంటర్‌కు చెందిన సయ్యద్ అస్లాం మృతి కేసులో జనసేన నేత పోతిన మహేశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు. అస్లాం మృతికి సంబంధించి పలు విషయాలపై తనను పోలీసులు విచారించినట్లు మహేశ్ చెప్పారు. ఈ సందర్భంగా.. అస్లాం మృతి కేసులో పలు అనుమానాలను పోలీసులకు వివరించినట్లు మహేశ్ తెలిపారు. ప్రస్తుతం.. అస్లాం మృతి కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందం కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతుంది. ఈ కేసును పోలీసులు త్వరితగతిన పరిష్కరించాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను మహేశ్ కోరినట్లు చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!