కల్తీ టీ పొడి గుట్టు రట్టు... భారీగా సరకు స్వాధీనం - fake tea power
గుట్టుచప్పుడు కాకుండా కల్తీ టీ పొడి తయారు చేసి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు తెలంగాణకు సరఫరా చేస్తున్న ఓ వ్యాపారి గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్టు చేశారు.
![కల్తీ టీ పొడి గుట్టు రట్టు... భారీగా సరకు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4433737-296-4433737-1568417090177.jpg)
మీరు టీ పొడి కొంటున్నారా ? జర జాగ్రత్త. ఆ పొడి నకిలీదో, అసలుదో తెలుసుకోండి. విజయవాడ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ టీ పొడి దందా వెలుగులోకి వచ్చింది. మాచవరంలో నివసించే గంటాభాస్కర్ డబ్బుకోసం అక్రమమార్గం పట్టాడు. నాసిరకం టీ పొడిని తెచ్చి విక్రయిస్తున్నాడు. తమిళనాడు, కోయంబత్తూర్ల నుంచి తక్కువ ధరలో టీ డస్ట్ ను కొనుగోలు చేసి నగరానికి తెస్తాడు. మంచి రంగు వచ్చేందుకు వాటికి సింథటిక్ రంగును వేస్తారు. దీనివల్ల పరిమాణం కూడా పెరుగుతుంది. అనంతరం ఆ పొడిని అందంగా ప్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో కిలో రూ. 150నుంచి రూ. 200కే విక్రయించేవాడు. సగం ధరకే లభ్యమవుతుండటంతో గిరాకీ పెరిగింది. రోజుకు 150 కిలోల నుంచి 200 కిలోల వరకు విక్రయించేవాడు. దీనిపై పక్కా సమాచారమందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు గంటా భాస్కర్ ఇంటిపై దాడులు చేశారు. 3.55 లక్షల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టీ పొడితో తయారు చేసిన టీ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు తెలిపారు.