ఆపదలో ఆదుకునేందుకు తానా ఎప్పుడూ ముందుంటుందని విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. తానా అందించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆయన విజయవాడలో కరోనా బాధితులకు పంపిణీ చేశారు. గతంలోనూ తానా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిందని ప్రశంసించారు. ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది మరణిస్తున్నారని.. ఇలాంటి విపత్కర సమయంలో తానా.. మందుల కిట్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చి దాతృత్వం చాటుకుందన్నారు.
తానా ఔధార్యం: కరోనా బాధితులకు 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేత - విజయవాడలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసిన తానా
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఔధార్యాన్ని చాటుకుంది. కరోనాతో బాధపడుతున్న వారికి 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసింది. వాటిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడలో పంపిణీ చేశారు.
tana donates oxyzen concentraters