Raids On Medical Shops at Vijayawada: విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ఔషధ దుకాణాల్లో చెన్నై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నక్కల రోడ్డులోని సత్యడ్రగ్ హౌస్, పుష్ప హోటల్ సెంటర్లోని వెంకటాద్రి ఫార్మాల్లో సోదాలు జరిపారు.
విజయవాడలోని ఔషధ దుకాణాల్లో తమిళనాడు పోలీసుల తనిఖీలు - raids on medical shops at vijayawada today

20:09 January 03
వెంకటాద్రి ఫార్మా, సత్య డ్రగ్ హౌస్‌లో సోదాలు జరిపిన పోలీసులు
నొప్పి నివారణకు వినియోగించే టైడాల్ మందులను హోల్ సేల్‌గా బిల్లులు లేకుండానే చెన్నైకి సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు.. నగరంలోని పలు దుకాణాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఎన్ని రోజులుగా సరఫరా జరుగుతుంది..? ఎవరికి చేరుతుంది..? అనే విషయాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ తనిఖీల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ ఔషధాన్ని వైద్యుల సూచనల మేరకే వాడాలని.. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. టైడాల్ ఔషధం మత్తును కలిగిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి:
CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి