తాడేపల్లి గోశాల దుర్ఘటన పై తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే, భాజపా నేత రాజాసింగ్ స్పందించారు. గోశాలలో వంద ఆవులు చనిపోవడం బాధాకరమని అన్నారు. వంద మూగజీవాలు చనిపోయినా ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి అసలు నిజం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గోశాల భూమి విలువ పెరగిన కారణంగానే.. కొందరు కుట్ర పన్ని గోవులను అంతమొందించారని ఆరోపించారు. త్వరలోనే తాడేపల్లి గోశాలకు వెళ్లి నిజాలను తెలుసుకుంటానని రాజాసింగ్ చెప్పారు.
''మూగజీవాలు చనిపోతే.. ప్రభుత్వం స్పందించదా?'' - తాడేపల్లి గోశాల దుర్ఘటన
తాడేపల్లిలో.. పెద్ద సంఖ్యలో మూగ జీవాలు చనిపోవడం విచారకరం అన్నారు తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ . త్వరగా ఈ కేసును విచారించాలని ఏపీ ప్రభుత్వంను డిమాండ్ చేసారు.
'వంద మూగజీవాలు చనిపోయినా ప్రభుత్వ స్పందన లేదు' : ఎమ్మెల్యే రాజాసింగ్