Swiggy Delivery Boys Protest: స్విగ్గీ డెలివరీ బాయ్స్ విజయవాడలో ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం తమతో ఎక్కువ పని చేయిస్తూ.. తక్కువ డబ్బులు ఇస్తోందని ఆరోపించారు. 24 గంటలు కష్టపడుతున్నా 500 రూపాయలు రావటం లేదని, ఇన్సెంటివ్ పేరుతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినా.. రెండేళ్ల క్రితం డెలివరీకి ఎంత ఇస్తున్నారో, ఇప్పుడు అదే విధంగా ఇస్తున్నారన్నారని వాపోయారు.
"పని ఎక్కువ.. డబ్బులు తక్కువ.." స్విగ్గీ బాయ్స్ ఆందోళన - కనీస వేతనం రావట్లేదని ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆగ్రహం
Swiggy Delivery Boys Protest: విజయవాడ నగరంలోని మహానాడు రోడ్డులో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. 24 గంటలు కష్టపడుతున్నా 500 రూపాయలు కూడా రావటం లేదని, స్విగ్గీ యజమానులు ఇన్సెంటివ్ పేరుతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
!["పని ఎక్కువ.. డబ్బులు తక్కువ.." స్విగ్గీ బాయ్స్ ఆందోళన swiggy delivery boys protest at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15298352-716-15298352-1652686487128.jpg)
విజయవాడలో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన
విజయవాడలో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన
శని, ఆదివారాల్లో ఫుడ్ డెలివరీ చేసేవారికి మాత్రమే ఇన్సెంటివ్ ఇస్తున్నారని.. రోజువారిగా చేసే తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జీవితాలు చాలక పూట గడవటం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవటం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: