ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్టీ కమిషన్ చైర్మన్​గా డాక్టర్ కుంభా రవిబాబు బాధ్యతల స్వీకరణ - షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్​గా డాక్టర్ కుంభా రవిబాబు వార్తలు

రాజ్యాంగపరంగా గిరిజనులకు కల్పించిన హక్కులను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని.. రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ డాక్టర్ రవిబాబు తెలిపారు. విజయవాడ ఆర్‌అండ్​బి కార్యాలయంలోని ఎస్టీ కమిషన్‌ కార్యాలయంలో డాక్టర్‌ కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు.

scheduled commisson chairman
scheduled commisson chairman

By

Published : Mar 27, 2021, 7:08 PM IST

రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా డాక్టర్‌ కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగపరంగా గిరిజనులకు కల్పించిన హక్కులను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌అండ్​బి కార్యాలయంలోని ఎస్టీ కమిషన్‌ కార్యాలయంలో.. ఛైర్మన్‌గా రవిబాబు బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది షెడ్యూల్డ్ తెగల ప్రజలు జీవిస్తున్నారని.. రవిబాబు తెలిపారు. వీరి హక్కులను పరిరక్షించేందుకు కమిషన్‌ పని చేస్తుందన్నారు. తాను కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధితోపాటు విద్య, వైద్యం సక్రమంగా వారికి అందేలా పర్యవేక్షిస్తానన్నారు. షెడ్యూల్డు తెగల ప్రజలపై జరిగే దాడులు, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై కమిషన్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని.. బాధితులకు న్యాయం అందేలా కమిషన్‌ పని చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీలో షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన ఉద్యోగాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేస్తామన్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ రవిబాబును.. పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details