విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చతుర్వేద హవనం' కార్యక్రమం పరిసమాప్తమైంది. సోమవారం పూర్ణాహుతి జరిపారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోమం ప్రభావం వల్లే దుర్గమ్మ ఆలయ రథానికి చెందిన వెండి సింహాల ప్రతిమల దొంగలు దొరికినట్లు భావిస్తున్నామని స్వామీజీ అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చతుర్వేద హోమం విజయవాడలోనే కాకుండా కాళహస్తి, శ్రీశైలం, కాణిపాకంలో నిర్వహించటం సంతోషకరమని చెప్పారు.
'హోమం వల్లే వెండి సింహాల దొంగలు దొరికారు' - silver lion statues theft case
'చతుర్వేద హవనం' కార్యక్రమ ప్రభావం వల్లే దుర్గమ్మ ఆలయ రథానికి చెందిన వెండి సింహాల ప్రతిమల దొంగలు దొరికినట్లు భావిస్తున్నామని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఇంద్రకీలాద్రిపై సోమవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
swatma nandendra saraswati
మరోవైపు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వారికి దేవుడే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:దుర్గ గుడి వెండి సింహాల కేసులో నిందితులు అరెస్టు.. చోరీ ఎలా జరిగిందంటే?