ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్ ఘటన: నిందితుల కస్టడీ రివ్యూ పిటిషన్ డిస్మిస్ - swarna palace incident news

సంచలనం స్పష్టించిన స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో అరెస్టయిన నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్​ను ఐదో మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. ఇలా జరగడం ఇది రెండోసారి.

Swara_Palace
Swara_Palace

By

Published : Aug 20, 2020, 11:26 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరుతూ రివ్యూ పిటిషన్ వేశారు. ఐదో అడిషనల్ మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టులో ఈ విషయమై గురువారం విచారణ జరిగింది.

ముగ్గురి నుంచి కోవిడ్ కేర్​ సెంటర్​కు సంబంధించిన వివరాలు రాబట్టాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్​ను డిస్మిస్ చేసింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇటీవలే పోలీసులు మరో కోర్టులో పిటిషన్​ వేయగా... అక్కడ డిస్మిస్ చేయటంతో రెండోసారి పిటిషన్ వేసినా అదే స్పందన వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details