విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంపై విద్యుత్తు అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తటంతో విద్యుత్తు శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హోటల్‌కు సంబంధించిన హెచ్‌టీ సర్వీసును తనిఖీ చేశారు.
స్వర్ణ ప్యాలెస్ అంతర్గత లోపాలే ప్రమాదానికి కారణం? - విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ వార్తలు
10 మందిని పొట్టనబెట్టుకున్న విజయవాడలో అగ్నిప్రమాద ఘటనకు హోటల్లోని అంతర్గత లోపాలే కారణమని విద్యుత్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. హెచ్‌టీ కనెక్షన్ ద్వారా షార్ట్ సర్యూట్ జరగలేదని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
హోటల్లో కనెక్షన్‌కు సంబంధించిన పరికరాల ఫ్యూజులు పోలేదని, భద్రంగా ఉన్నాయని విద్యుత్తు శాఖ అధికారులు గుర్తించారు. ట్రాన్స్ఫార్మర్, మీటర్లు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు అధికారులు గమనించారు. హోటల్‌కు సంబంధించి మరేదైనా అంతర్గత కారణంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గుంటూరు నుంచి విద్యుత్తు భద్రతా తనిఖీ విభాగం అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. వారు కూడా ఎక్కడా శాఖాపరంగా లోపాలు లేవని గుర్తించారు. మరేదైనా కారణంతో మంటలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. సోమవారం ఆగ్ని ప్రమాద కారణాలు, ఇతర వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. దీనిపై కృష్ణా జిల్లా విద్యుత్తు ఎస్ఈ జయకుమార్ ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. కనెక్షన్‌కు సంబంధించిన అన్ని పరికరాలలో ఫ్యూజులు సక్రమంగానే ఉన్నాయన్నారు. హెచ్‌టీ కనెక్షన్ ద్వారా షార్ట్ సర్యూట్ అయితే ఇవన్నీ మంటల్లో చిక్కుకునేవని వివరించారు.