తితిదే తీసుకునే ప్రతి నిర్ణయం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్వరూపానంద వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులు ఎదురుచూస్తున్నారని.. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ వివాదాన్ని సత్వరం పరిష్కరించాలని సూచించారు.
తితిదే విషయంలో వివాదాలు వద్దు: స్వామి స్వరూపానంద - తితిదే ఆస్తుల అమ్మకం న్యూస్
తితిదే విషయంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని శారధ పీఠాధిపతి స్వామి స్వరూపానంద ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలు, తితిదే ఛైర్మన్, ఈవోతో కీలక మంతనాలు జరిపారు.
swamy swaroopanandendra suggetions to govt on sale of ttd assets issue