రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం ఘటనకు కారకులైనా వారిని కఠినంగా శిక్షించాలని విశాఖ శారదా పీఠం కోరింది. ఈ మేరకు విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి.. సీఎం జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో దేవాలయాల భద్రతపై ఇరువురు చర్చించారు. ప్రైవేటు ఆలయాల కమిటీలతోనూ దేవాదాయశాఖ, పోలీసులు సమన్వయం చేసుకోవడంపై చర్చించారు. జరిగిన దాడులపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.
'విగ్రహాల ధ్వంసం ఘటనకు కారకులైనా వారిని కఠినంగా శిక్షించాలి'
దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కోరారు. జరిగిన దాడులపై దర్యాప్తును వేగవంతం చేసి దోషులను శిక్షించాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు.
విగ్రహాల ద్వంసం ఘటనకు కారకులైనా దోషులను కఠినంగా శిక్షించాలి
గత ప్రభుత్వం హయాంలో విజయవాడలో పడగొట్టిన దేవాలయాల పునఃనిర్మాణానికి ఈ నెల 8 శంకుస్థాపన చేస్తున్నట్టుగా జగన్ చెప్పినట్లు స్వామీజీ తెలిపారు. ఇప్పటికే 30వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. సనాతన ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పినట్లు స్వామిజీ పేర్కొన్నారు.