ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Swach Sankalp: 100 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలు - జగనన్న స్వచ్ఛసంకల్పం

గాంధీ జయంతి సందర్భంగా వంద రోజుల పాటు రాష్ట్రంలో 'జగనన్న స్వచ్ఛ సంకల్పం'(Swach Sankalp) కింద పరిశుభ్రత కార్యక్రమాలు(Sanitation programs) నిర్వహిస్తామని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. అక్టోబరు 7 తేదీన సీఎం చేతుల మీదుగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి

By

Published : Sep 29, 2021, 4:33 PM IST

అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని వరుసగా వంద రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలను(Sanitation programs) నిర్వహిస్తామని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ఈ అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

'జగనన్న స్వచ్ఛ సంకల్పం'లో(Swach Sankalp) ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని మంత్రి స్పష్టం చేశారు. అక్టోబరు 7వ తేదీన సీఎం చేతుల మీదుగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ఇదీ చదవండి:నిధులు రాక.. ఇంటింటికీవెళ్లి చెత్త సేకరణ..

ABOUT THE AUTHOR

...view details