ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DURGA TEMPLE: దుర్గగుడిలో సస్పెండైన 15 మంది తిరిగి విధుల్లోకి

By

Published : Jul 4, 2021, 3:09 AM IST

Updated : Jul 4, 2021, 7:10 AM IST

దుర్గ గుడిలో ఏసీబీ సోదాల్లో సస్పెండైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆలయ ఈవో భ్రమరాంబ లేఖతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

DURGA TEMPL
DURGA TEMPL

విజయవాడ దుర్గగుడిలో(DURGA TEMPLE) ఏసీబీ (ACB) తనిఖీల నేపథ్యంలో సస్పెండైన 15మంది ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ దేవదాయశాఖ కమిషనర్‌... ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గగుడిలో ఏడుగురు సూపరింటెండెంట్‌లు, ఎనిమిది మంది సిబ్బంది సస్పెన్షన్‌లో ఉండడంతో పరిపాలన ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఆలయ ఈవో భ్రమరాంబ.. కమిషనర్‌కు తాజాగా లేఖ రాశారు. దీనికి తోడు సస్పెండ్‌ అయిన ఉద్యోగుల్లో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌ ఎంక్వయిరీ కింద వీరిని తిరిగి విధుల్లోనికి తీసుకుంటున్నట్టు కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. 15 మంది సిబ్బందిని దుర్గగుడిలో కాకుండా రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు బదిలీ చేశారు.

Last Updated : Jul 4, 2021, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details