protection from MP Nandigam Suresh: అనారోగ్యంతో మూడేళ్ల నుంచి విధులకు గైర్హాజరు కావటంతో ఉద్యోగం నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకునేలా సాయం చేయాలని కోరినందుకు వైకాపా ఎంపీ నందిగం సురేష్ తనపై చేయిచేసుకుని, కులం పేరుతో దూషించారని డిస్మిస్ అయిన కానిస్టేబుల్ బత్తుల బాబూరావు ఆరోపించారు. దిల్లీలో ఉన్న ఆయనకు ఎస్‌ఎంఎస్ ఇచ్చి ఫోన్‌చేసి అడిగినందుకు దుర్భాషలాడారని వాపోయారు.ఈనెల 7న అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, ఎంపీతోపాటు ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి, ఫోన్ లాగేసుకుని, అందులోని ఆడియో, వీడియో రికార్డులను తొలగించారని ఆరోపించారు. తనతో పాటు భార్య, కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. ఎంపీ నుంచి ప్రాణహాని ఉందని శుక్రవారం గుంటూరు ఎస్పీని కలిశారు. మరోవైపు ఎంపీకి ఫోన్ చేసిన బాబూరావు ఇష్టానుసారం మాట్లాడారంటూ పీఏ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా తీసుకొచ్చామని, కొట్టలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు చెప్పారు.
పదేపదే విసిగించాడు: ఎంపీ