ఈనెల 12 నుంచి మార్చి 13 వరకు మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు, రథసప్తమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో.. విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూర్యోపాసనలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ మాసాన్ని పురస్కరించుకుని.. ఆయా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు.
సూర్యోపాసనలో భాగంగా ఆలయ అర్చకులు.. అరుణ పారాయణ సౌరము, సూర్య నమస్కారములు, సూర్యుని జపాలు నిర్వహించారు. వీటితో పాటు ఇతర సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులకు.. దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.org లో, kanakadurgamma మొబైల్ ఆప్‌లో, మీ-సేవ కేంద్రాలలో, దేవస్థానం మహామండపం ఏడో అంతస్తులోని ఆర్జిత సేవ కౌంటరులో టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.