రాష్ట్రంలోని జిల్లాకో హైటెక్ డయాగ్నొస్టిక్ సెంటరు, సీటీ స్కాన్ యంత్రం మంజూరు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్‌కు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ‘నా ఎంపీ ల్యాడ్స్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొవిడ్ సహా అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే వీలున్న అధునాత డయాగ్నొస్టిక్ సెంటర్లను మంజూరు చేయాలనుకుంటున్నా. వీటితో పాటు 13 సీటీ స్కాన్ యంత్రాలనూ మంజూరు చేస్తున్నా. ఈ యంత్రాలను ఆయా జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే.. గుంటూరు జిల్లా నూతక్కి గ్రామంలో గ్రామీణ కౌశల్ వికాస కేంద్రం ఏర్పాటుకు, ఇదే జిల్లాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపా’ అని లేఖలో పేర్కొన్నారు.
జిల్లాకో హైటెక్ డయాగ్నొస్టిక్ సెంటర్ - కృష్ణా జిల్లా కలెక్టర్ కు సురేష్ ప్రభు లేఖ
ఏపీలో జిల్లాకో హైటెక్ డయాగ్నొస్టిక్ సెంటర్ , సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు లేఖ రాశారు.

Suresh Prabhu
TAGGED:
Suresh Prabhu news