తమ సమ్మతి లేకుండా ఏపీ నుంచి రిలీవ్ చేసి తెలంగాణకు కేటాయించారని ఆరోపిస్తూ విద్యుత్ సంస్థల్లోని పలువురు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలుంటే కమిటీకే తెలపాలని చెప్పి, పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో విచారణ ముగిసినట్లు కోర్టు పేర్కొంది.
ఉద్యోగుల పంపకాలపై జస్టిస్ ధర్మాధికారి కమిటీకే నివేదించండి - విద్యుత్ ఉద్యోగులపై సుప్రీ కోర్టు తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల పంపకాలపై వివాదాలేమైనా ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ వద్దకే వెళ్లి నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
supreme court on telugu state electricity employees
TAGGED:
ap bifurcation disputes news