Supreme Court On Shops Allocation At Temples: రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేవాలయాల్లో హిందూయేతరులకు షాపుల కేటాయింపుపై సుప్రీం తీర్పు అమల్లో నిర్లక్ష్యం వహించడంతో.. వైకాపా ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు అయింది.
దేవాలయ షాపుల వేలంలో.. అన్ని మతాలవారూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు - సుప్రీం న్యూస్
21:21 December 17
తీర్పును వెంటనే అమలుచేయాలని రాష్ట్రానికి ఆదేశం
పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో మతం అడ్డు కాకూడదన్న సుప్రీం.. వేలంలో అన్ని మతాలవారూ పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ నేపథ్యం..
దేవాలయాల్లో అన్య మతస్థులకు దుకాణాల కేటాయింపు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. జగన్ ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ.. శ్రీశైలం దుకాణ యజమానులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో.. దుకాణ యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీం.. దుకాణ యజమానులకు అనుకూలంగా ఫిబ్రవరిలో తీర్పును వెలువరించింది.
ఇదీ చదవండి
CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు