ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగుజాతి ఉన్నంతవరకు బాలు ఉంటారు: జస్టిస్ ఎన్.వీ. రమణ - ఎస్పీ బాలు మృతి తాజా వార్తలు

తెలుగుజాతి ఉన్నంతకాలం ఎస్పీ బాలు ఉంటారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ. రమణ అన్నారు. ఆయన తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారని కొనియాడారు. ఎస్పీబీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

supreme court justice nv ramana condolences to sp balu demise
ఎస్పీ బాలు మృతి పట్ల జస్టిస్ ఎన్​.వీ. రమణ సంతాపం

By

Published : Sep 25, 2020, 7:59 PM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వీ. రమణ సంతాపం తెలిపారు. బాలు మృతి తెలుగుభాష‌కు, తెలుగుజాతికి తీర‌ని లోటని ఆయన అన్నారు. తెలుగుజాతి ఉన్నంత‌వ‌ర‌కు బాలు ఉంటారన్నారు. బాలు తన అమృత‌గానంతో అందరినీ ఆనందసాగరంలో ఓలలాడించారని ఎన్​.వీ. రమణ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details