MINISTER SURESH: 'రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు' - మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
17:23 September 15
మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంలో విచారణ
మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని ఆధారాలు సేకరించాకే మంత్రి సురేశ్(minister suresh) దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల(illegal assets) కేసు నమోదు చేసినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. పలువురి ఇళ్లలో సోదాలు జరిపి ఆధారాలు సేకరించినట్లు వివరించింది. ఆధారాలుంటే ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ(CBI) తెలిపింది.
రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని మంత్రి సురేశ్ దంపతులు ఆరోపించారు. ఫలితంగా ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసినట్లు మంత్రి సురేశ్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ చేపట్టారని వాదించారు. ఈ కేసుపై రేపు కూడా విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
ఇదీచదవండి.