ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఉపాధ్యాయుల భర్తీపై నివేదికను సమర్పించండి" - report

ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన సరిగా లేదని సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్​లో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది శ్రావణ్​కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై నివేదికకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

సుప్రీం

By

Published : Jul 27, 2019, 7:08 AM IST

పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ తాజా పరిస్థితిపై తెలుగు రాష్ట్రాలు మూడు వారాల్లో నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను శుక్రవారం జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎంఆర్​షాలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. వివరాలు అందజేయడానికి కొంత గడువు కావాలని ఏపీ తరఫు అడ్వకేట్ జీఎన్​రెడ్డి ఆన్ రికార్డ్స్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణలో, నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్​లో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది శ్రావణ్​కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. నివేదికను మూడు వారాల్లో సమర్పించకుంటే ఉభయ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులూ స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details