ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జ్యుడిషియల్ అధికారిణి బీఎస్ భానుమతి, న్యాయవాది డాక్టర్ కె.మన్మథరావు పేర్లకు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ది. ఈనెల 11న సమావేశమైన సుప్రీం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది.
* బీఎస్ భానుమతి ప్రస్తుతం ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు బీకేవీ శాస్త్రి కుమార్తె ఆమె. రాజమహేంద్రవరం, కొవ్వూరులలో విద్యాభ్యాసం చేసిన ఆమె న్యాయవాదిగా పదేళ్లపాటు ప్రాక్టీసు చేశారు. 2002 ఆగస్టు 21న నేరుగా జిల్లాజడ్జిగా ఎంపికయ్యారు. వరంగల్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో సేవలందించారు. 2020 జూన్‌లో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులయ్యారు.