ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vundavalli Arunkumar: రాష్ట్రాల విభజన అంశం.. ఉండవల్లి పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం - ఉండవల్లి అరుణ్‌ కుమార్

Supreme Court agreed to the hearings on vundavalli arunkumar Petition
రాష్ట్రాల విభజన నియమ నిబంధనలపై ఉండవల్లి పిటిషన్​కు సుప్రీంకోర్టు అంగీకారం

By

Published : Apr 8, 2022, 11:55 AM IST

Updated : Apr 8, 2022, 12:59 PM IST

11:49 April 08

ఏపీ విభజన విషయంలో తప్పులు జరిగాయని సుప్రీంను ఆశ్రయించిన ఉండవల్లి

Vundavalli Arunkumar: రాష్ట్రాల విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి అరుణ్ కుమార్.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ విభజన విషయంలో తప్పులు జరిగాయని.. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు. విభజన ప్రక్రియ సరైంది కాదని కోర్టును ఆశ్రయించారు. ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్‌లో జాగ్రతలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్ వేయగా.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్​ను.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేసి చాలా కాలం అయిందని, ఏపీ విభజనపై ఇటీవల ప్రధాని వ్యాఖ్యలను.. సైతం ఆయన కోర్టులో ప్రస్తావించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు అంగీకరించిన సీజేఐ.. త్వరితగతిన విచారణకు అంగీకారం తెలిపారు. వచ్చే వారంలో లిస్ట్‌లో పొందుపరిచేలా చూడాలని.. సీజేఐ రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇదీ చదవండి:

Last Updated : Apr 8, 2022, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details