ఏపీలోని వెల్దుర్తి స్టేషన్ నుంచి కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్) సరఫరాను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. 80 కంటైనర్లలో దాదాపు 2,200 టన్నుల కాస్టిక్ సోడా వెల్దుర్తి నుంచి ఒడిశా రాష్ట్రంలోని డమాన్‌జోడి వద్ద నాల్కో సైడిరగ్ వరకు 40 బి.ఎల్.ఎల్ వ్యాగన్లలో తరలించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
South Central Railway:వెల్దుర్తి నుంచి కాస్టిక్ సోడా సరఫరా ప్రారంభం - వెల్దుర్తి నుంచి ఒడిశా రైలులో కాస్టిక్ సోడా సరఫరా
వెల్దుర్తి రైల్వే స్టేషన్ నుంచి కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్) సరఫరాను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. 80 కంటైనర్లలో దాదాపు 2,200 టన్నుల కాస్టిక్ సోడా వెల్దుర్తి నుంచి ఒడిశా రాష్ట్రంలోని డమాన్‌జోడి వద్ద నాల్కో సైడిరగ్ వరకు 40 బి.ఎల్.ఎల్ వ్యాగన్లలో పంపించింది.

వెల్దుర్తి స్టేషన్ నుంచి 50 కిమీ దూరంలో ఉండే కర్నూలు సమీపంలోని తాండ్రపాడు గ్రామం వద్ద కాస్టిక్ సోడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని సబ్బులు, రేయాన్, కాగితం, పేలుడు పదార్థాలు, రంగులు, పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా కాటన్ బట్టలు, లాండ్రింగ్, బ్లీచింగ్, మెటల్ వస్తువులను శుభ్రపరచడంలో, ఆక్సైడ్ కోటింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోలిక్ ఎక్సాట్రింగ్‌లో కూడా దీన్ని వినియోగిస్తారు. ఈ సరుకును గతంలో రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసేవారని ప్రస్తుతం రైల్వే ద్వారా సరఫరా చేయడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారని రైల్వేశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి:TEMPLES DESTROYED: శ్రీకాకుళం జిల్లాలో ఆలయాల కూల్చివేత.. భక్తుల ఆగ్రహం