బెజవాడలో 'భానుడి' భగభగలు
బెజవాడలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతూ...నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
విజయవాడలో ఎప్పటిలానే వేసవి సెగలు మంటపుట్టిస్తున్నాయి ముదురుతున్న ఎండలతో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు..మార్చి మొదటివారం లోనే రికార్డ్ స్థాయిలో45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండంతో ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. వడదెబ్బతో వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సదుపాయాల రూపకల్పనకు కార్యాచరణ చేస్తున్నారు..ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని వేసవి కాలంలో తగు జాగ్త్రత్తలు తీసుకోవాలనిసూచిస్తున్నారు.