రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్నవారిని ఆదుకునేందుకు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ ముందుకొచ్చింది. విజయవాడలోని తమ వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో వందపడకల ఆసుపత్రి నెలకొల్పేందుకు నిర్ణయించింది. అనుమతులివ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌కు ఫౌండేషన్ సీఈవో ఏకే రావు లేఖ రాశారు. ప్రభుత్వ నిబంధనలతో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రోగులకు అవసరమైన మందులు, ఆహారాన్ని ఫౌండేషన్ సమకూరుస్తుందని తెలిపారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలతో మందులు, ఆహారపంపిణీ, సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
సుజనా ఫౌండేషన్ దాతృత్వం: 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ - సుజనా ఫౌండేషన్ తాాజా వార్తలు
కొవిడ్ విజృంభిస్తోన్న వేళ సుజనా ఫౌండేషన్ దాతృత్వాన్ని చాటుకుంది. 100 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. కొవిడ్ కేంద్రం ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ ఫౌండేషన్ సీఈవో ఏకే రావు.. కలెక్టర్ ఇంతియాజ్‌కు లేఖ రాశారు.

sujana foudation