ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

successful entrepreneur in hyderabad: 25 వేల పెట్టుబడితో.. 20 కోట్ల టర్నోవర్​ స్థాయికి.. - successful business in hyderabad

successful entrepreneur in hyderabad: ఆ యువకుడి కుటుంబంలో ఎవరికీ వ్యాపార నేపథ్యం లేదు. అయినా.. చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త కావాలనేదే అతడి లక్ష్యం. మధ్య తరగతి కుటుంబ కష్టాలున్నా, ప్రభుత్వ ఉద్యోగం అంది వచ్చినా లెక్కచేయలేదు. వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే సంకల్పంతోనే శ్రమించాడు. చిన్నచిన్న అవకాశాల్ని సమర్థంగా వినియోగించుకున్నాడు. రూ.25 వేల పెట్టుబడితో మొదలై.. 20 కోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌.

25 వేల పెట్టుబడితో.. 20 కోట్ల టర్నోవర్​ స్థాయికి..
25 వేల పెట్టుబడితో.. 20 కోట్ల టర్నోవర్​ స్థాయికి..

By

Published : Dec 11, 2021, 4:05 PM IST

successful entrepreneur in hyderabad: హైదరాబాద్‌ పద్మారావు నగర్‌కు చెందిన భీముని అభిలాష్‌కు చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలన్నదే కోరిక. తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నా.. ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగం గురించి ఆలోచించలేదు. ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి? ఎలా నడిపించాలి? ఎలా దాన్ని విజయ తీరాలకు చేర్చాలి? అనే ఆలోచిస్తుండే వాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుండే వాడు.

hyderabad young entrepreneur: తన ప్రతీ అడుగును వ్యాపారానికి ఉపయోగపడేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఈ యువకుడు. 2012లో జేఎన్టీయూ నుంచి బీటెక్‌ పూర్తి చేశాక... ఓ సంస్థలో ఇంజనీర్‌గా చేరిపోయాడు. రెండేళ్ల అనుభవంలో వ్యాపార మెళకువలు తెలుసుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. వ్యాపార సన్నాహాలు మొదలుపెట్టాడు. వ్యాపార ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలోనే తండ్రి మృతి చెందాడు. పెద్ద కుమారుడిగా రైల్వేఉద్యోగం ఇస్తామన్నారు. తన ఆశయం కోసం దాన్ని వద్దనుకున్న అభిలాష్‌.. 2015లో ఎకో సెల్యూషన్‌ ఫర్మ్‌ పేరుతో సొంత సంస్థను స్థాపించాడు. బీటెక్‌లో తన సహచరుడైన నవీన్‌ అనే మరో వ్యక్తిని జతచేసుకుని... వ్యాపారం మొదలు పెట్టాడు.

successful business in hyderabad: ప్రారంభంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే బండారు దత్తాత్రేయ చేసిన మాట సాయం అతనికి కలిసొచ్చింది. పలువురు వ్యాపారవేత్తలు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అలా... ఇన్‌ఫ్రా రంగంలో పేరున్న ఓ సంస్థ కల్పించిన అవకాశంతో.. నిమ్స్‌లో స్టెమ్‌ సెల్‌ ల్యాబొరేటరీకి రూపకల్పన చేశాడు. గడువు కంటే ముందే ప్రాజెక్ట్‌ పూర్తి చేసి మంచి పేరు సంపాదించాడు... అభిలాష్‌. హైదరాబాద్‌ నిమ్స్‌లో చేసిన పని నచ్చడంతో... చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రిలోనూ ఓ ప్రాజెక్ట్‌ దక్కింది. జీవీకే బయో హైదరాబాద్‌, బెంగళూరులో రీసెర్చ్‌ ల్యాబొరేటర్స్‌ని తయారు చేసింది అభిలాష్‌ సంస్థ. తర్వాత కొన్ని రోజుల్లోనే విద్యుత్‌, ఇన్‌ఫ్రా రంగంలోకి అడుగు పెట్టి.... నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ మెస్‌ అనే సివిల్‌ ప్రాజెక్ట్‌ టెండర్‌ దక్కించుకుంది.

success stories of entrepreneurs in hyderabad: 25 వేలతో ప్రారంభమైన అభిలాష్‌ ప్రయాణం... నేడు 20కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. సబ్‌ కాంట్రాక్ట్‌ స్థాయి నుంచి సొంతంగా టెండర్లు వేసే స్థాయికి ఎదిగి... ఎలక్ట్రికల్‌, సివిల్‌, మోకానికల్‌కు విభాగాల్లో ఎంతోమంది ఇంజినీర్లకు పని కల్పిస్తున్నాడు. వారి పర్యవేక్షణలో... రోజూ 3, 4 వందల మంది కార్మికులు, ఇతర సాంకేతిక సభ్యులు ఉపాధి పొందుతున్నారు. క్రమక్రమంగా... విభిన్న రంగాల్లోకి ప్రవేశించిన అభిలాష్‌ సంస్థ..... హీటింగ్‌, వెంటిలేషన్, ఎయిర్‌ కండీషనల్‌ ప్రాజెక్టులు, సెంట్రల్‌ ఏసీ, వైరస్‌ పైన పరిశోధన చేసే ల్యాబొరేటరీస్‌, ఆపరేషన్‌ థియేటర్స్‌ వంటి ఎలక్ర్టికల్‌ ప్రాజెక్టులకు రూప కల్పన చేస్తోంది. భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయిలో పాజెక్ట్‌లు చేయడమే తన తదుపరి లక్ష్యం అంటున్నాడు అభిలాష్​.

ఇదీ చూడండి:పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా కోసం మళ్లీ యత్నం.. కేంద్రానికి లేఖ రాయనున్న కేసీఆర్!

ABOUT THE AUTHOR

...view details