Students Protest to release job calender: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడతామన్న విద్యార్థి సంఘం నాయకులు.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు.
విజయవాడ ధర్నాచౌక్ లో
విజయవాడ ధర్నాచౌక్ లో నిరుద్యోగ, యువజన సంఘాలు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధర్నాచౌక్‌కు చేరుకున్న నిరుద్యోగ యువత, యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు..ఉద్యోగం వచ్చేవరకు 5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు తెదేపా మద్దతు తెలిపింది. ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న తెలుగు యువత నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడిగితే ప్రభుత్వం నిరుద్యోగులను జైలులో పెట్టి హింసిస్తోందని తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మండిపడ్డారు.
శ్రీకాకుళంలో యువత ధర్నా