ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అన్ని ఖాళీలతో నూతన జాబ్​ క్యాలెండర్ విడుదల చేయాలి' - జాబ్ క్యాలెండర్​కు వ్యతిరేకంగా నిరసనలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు ప్రకటిస్తూ.. నూతన జాబ్​ క్యాలెండర్(job calendar) విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు.. ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.

protest over job calendar
జాబ్ క్యాలెండర్​ రద్దు చేయాలి

By

Published : Jun 26, 2021, 8:16 PM IST

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి అన్ని శాఖల్లోని ఖాళీలు భర్తీ చేసేలా నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

విజయవాడలో..

వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర మండిపడ్డారు. విజయవాడ లెనిన్ కూడలిలో పీడీఎస్​యూ(pdsu) ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు. అన్ని ఖాళీలు పూర్తి చేసేలా నోటిఫికేషన్ ఇవ్వాలని.. లేదంటే నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో నిరుద్యోగ జేఏసీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులు ఆందోళన చేశారు. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఖాళీలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

గుంటూరులో..

ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు ప్రకటిస్తూ.. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏపీ ఉద్యోగ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ చార్టులో నామ మాత్ర ఖాళీలు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ నిరుద్యోగి గుండు చేయించుకొని మరీ నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

ఏలూరులో..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్త ఖాళీలతో నూతన జాబ్ క్యాలెండర్(job calendar)​ విడుదల చేయాలని ఎస్ఎఫ్​ఐ(sfi) నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత పట్ల మొండిగా వ్యవహరిస్తోందని.. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి యువతను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి..

CS Service Extension: సీఎస్ ఆధిత్యనాథ్ పదవీ కాలం పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details