విజయవాడ ఆర్ఆర్ పేటలోని శ్రీ దేవినేని వెంకటరమణ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో... విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్ధన్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కార్యక్రమంలో పాల్గొని... విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు.
విద్య వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరు విద్యావంతులైతే సమాజం వేగంగా అభివృద్ధి చెెందుతుందని పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.