ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Neet Exam: ఐదేళ్లలో 41.78 శాతం పెరిగిన నీట్‌-యూజీ పరీక్షల అభ్యరులు

By

Published : Mar 30, 2022, 9:05 AM IST

Neet exam: దేశంలో నీట్‌-యూజీ పరీక్షలు రాసే అభ్యరుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. గత ఐదేళ్లలో41.78 శాతం పెరిగిందని వెల్లడించింది.

students increased to appear in neet-ug examinations
ఐదేళ్లలో 41.78 శాతం పెరిగిన నీట్‌-యూజీ పరీక్షల అభ్యరులు

Neet exam: దేశంలో నీట్‌-యూజీ పరీక్షలు రాసే అభ్యరుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. గత ఐదేళ్లలో 41.78 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2017లో మొత్తం అభ్యరుల సంఖ్య 11 లక్షల 38 వేల 890 ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 16 లక్షల 14వేల 777కి చేరిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్య 42.27 శాతం మేర పెరగ్గా..ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం 33.10 శాతం మాత్రమే వృద్ధి చెందినట్లు పేర్కొంది. 2014లో ఉన్న 51వేల 348 సీట్లు.. 2021 నాటికి 75 శాతం పెరిగి.. 89 వేల 875కి చేరాయని.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వైద్య కోర్సుల ఫీజుల నిర్ధారణ... సంబంధిత రాష్ట్రాల ఫీజు రెగ్యులేటరీ కమిటీ పరిధిలో ఉంటుందని తెలిపారు. దేశంలో అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు తమిళనాడులో 10 వేల425 ఉండగా.. ఏపీలో 5 వేల 210 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details