ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్లాస్​రూంలో ఏం జరిగిందో.. ఏమో.. నడిరోడ్డుపై విద్యార్థినుల డిష్యూం డిష్యూం..! - విజయవాడ తాజా వార్తలు

Students clash: విజయవాడ వన్​టౌన్ కేబీఎన్ కళాశాల సమీపంలో విద్యార్థినులు ఘర్షణ పడ్డారు. నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Students clash
విద్యార్థినుల ఘర్షణ

By

Published : Apr 23, 2022, 11:32 AM IST

విద్యార్థినుల ఘర్షణ

Students clash: విజయవాడ వన్​టౌన్ కేబీఎన్ కళాశాల సమీపంలో విద్యార్థినిలు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. కళాశాల తరగతి గదిలో ఏమైందో ఏమో కానీ... కళాశాల వదిలిన వెంటనే బయటికి వచ్చిన విద్యార్థినిలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముష్టి యుద్ధానికి దిగారు. ఇప్పటి వరకు విద్యార్థులు వీధి పోరాటాలకు దిగటం అందరూ చూశారు. కానీ... ఇలా విద్యార్థినులు వీధిపోరాటాలు, ముష్టి యుద్ధాలు చేసుకోవడంపై స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యార్థినిలు కొట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి:'అమరావతిపై తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details