విజయవాడ నగర శివారు అజిత్ సింగ్ నగర్ లోని కండ్రిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద... కండ్రిక సుబ్బారెడ్డి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కరోనా పరిక్షల కోసం పడిగాపులు కాస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం అనంతరం విద్యార్ధులకు కరోనా పరీక్షలు తప్పనిసరి అని అధికారులు ఆదేశించారు.
అయితే... విద్యార్థులకు స్ధానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారనే సమాచారంతో... వారంతా అక్కడకు చేరుకున్నారు. కానీ.. పరిక్షలు చేసే సిబ్బంది రాకపోవటంతో... విద్యార్థులు ఆరోగ్య కేంద్రం ముందు నిరీక్షిస్తున్నారు.