ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జీవో నెంబర్ 77తో సుమారు 65 వేల మంది నష్టపోయే ప్రమాదం' - కృష్ణా న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యాదర్శి చల్లా కౌశిక్ డిమాండ్ చేశారు. జనవరి 5 లోగా వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 6న విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Student unions protest over issues at Vijayawada in Krishna district
'జీవో నెంబర్ 77తో సుమారు 65 వేల మంది నష్టపోయే ప్రమాదం'

By

Published : Jan 2, 2021, 9:02 PM IST

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యాదర్శి చల్లా కౌశిక్ డిమాండ్ చేశారు. ఈ జీవోతో బీసీ, యస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు సుమారు 65 వేల మంది నష్టపోయే ప్రమాదముందని అన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఫీజు రీయింబర్స్​మెంట్​కు అర్హులా.. కారా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

విద్యారంగంలో సమూల మార్పులు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఉపకార వేతనాలకు తూట్లు పొడవడం శోచనీయమని తెలిపారు. వినతి పత్రాన్ని అందించేందుకు వెళ్లిన విద్యార్థి సంఘ నేతలపై మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడటాన్ని తీవ్రంగా ఖండించారు. జనవరి 5 లోగా జీవో 77ను వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 6న విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

మోపిదేవి సుబ్రహ్మణేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ABOUT THE AUTHOR

...view details