ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాల నిరసన - నెల్లూరు వార్తలు

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. జీవో నంబర్ 77 వల్ల ప్రైవేటు విద్యాసంస్థలకు తీవ్ర నష్టం ఉందని తెలిపాయి. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పథకాలు విద్యార్థులందరికీ అమలు చేయాలని కోరారు. బకాయి పడిన ఫీజు రీయింబర్స్​మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయాలన్నారు.

Student unions protest
విద్యార్థి సంఘాల నిరసన

By

Published : Dec 26, 2020, 4:52 PM IST

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రతి విద్యార్థికి అందజేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు విజయవాడలో ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77తో కేవలం ప్రభుత్వ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న వారికే లబ్ధి ఉంటుందన్నారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. తక్షణమే జీవోను రద్దు చేసి విద్యార్థులందరికీ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

నెల్లూరులో ఎస్ఎఫ్ఐ ఆందోళన..

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టింది. 2018నుంచి బకాయిలన్నా రూ.570 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలో చదివే ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఉపకార వేతనాలను రద్దు చేస్తూ జీవోను తీసుకురావడం దుర్మార్గమన్నారు. దాన్ని రద్దు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. పథకాలను విద్యార్థులందరికీ వర్తింపచేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జీవో కాపీలను ఎస్ఎఫ్ఐ నేతలు దగ్ధం చేశారు.

జనవరి 9, 10తేదీల్లో ప్లీనరీ..

విజయనగరం యూత్ హాస్టల్​లో జిల్లా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధింత పోస్టర్లను ఆయన విడుదల చేశారు. జనవరి 9, 10తేదీల్లో ప్లీనరీ ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని మాన్సాస్ విద్యా సంస్థల ప్రైవేటీకరణపై మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30న జిల్లాకు రానున్న సీఎంతో మాన్సాస్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ వల్ల కలిగే ఇబ్బందులపై మాట్లాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

స్వర్ణముఖి నది నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా

ABOUT THE AUTHOR

...view details