ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్​ను పటిష్టంగా అమలు చేయండి: సీఎం - వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌ పటిష్టంగా అమలు చేయండి

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణకు వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. టెలీ మెడిసిన్​ను ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు.

వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్​ను పటిష్టంగా అమలు చేయండి: సీఎం
వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్​ను పటిష్టంగా అమలు చేయండి: సీఎం

By

Published : Apr 13, 2020, 1:50 PM IST

కరోనా నివారణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్​ను ప్రారంభించారు. కరోనా కేసుల గుర్తింపు, ఐసొలేషన్‌, పరీక్షలు, క్వారంటైన్‌కు పంపడమే లక్ష్యంగా టెలీ మెడిసిన్​కు శ్రీకారం చుట్టారు. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండగా...286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకొచ్చారు. టెలీ మెడిసిన్​కు ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నెంబరు 14410 కేటాయించింది.

వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌ పటిష్టంగా అమలు చేయండి

పటిష్టంగా అమలు చేయండి..
టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వైద్యుడితో మాట్లాడిన సీఎం జగన్...ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్య పెంచాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details