కరోనా లక్షణాలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులను తరలించడానికి సరిపడా స్ట్రెచర్లు లేక రోగుల బంధువులే భుజాలపై మోసుకుంటూ.. ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు. సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఒక వ్యక్తి నిల్చోవడానికి కూడా ఓపిక లేక కళ్లు తేలేయడంతో భయంతో బంధువులే భుజంపై మోసుకుంటూ ఆసుపత్రి వరకు చేర్చారు. కరోనా లక్షణాలతో ఉన్న మరో వ్యక్తిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి కరోనా విభాగం వద్దనే పడిగాపులు కాశారు.
స్ట్రెచర్ల కొరత... ద్విచక్ర వాహనాలే బాసట!
కరోనా మహమ్మారికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. వైరస్ బాధితులు ఆసుపత్రుల ముందు పడిగాపులు కాస్తున్నారు. హాస్పటల్ వద్ద రోగిని లోపలికి తీసుకువెళ్లేందుకు స్ట్రెచర్లు లేకపోవటంతో.. బాధితులు, బంధువులకు ఇబ్బందులు తప్పటం లేదు.
ద్విచక్ర వాహనాలే స్ట్రెచర్లు