Police Alert At AP-TS Border: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై తెరాస చేపట్టిన హైవే దిగ్బంధన కార్యక్రమంతో..రాష్ట్రంలోని సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద హైవే దిగ్బంధం చేయడంతో.. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాలను సరిహద్దుల్లోనే పోలీసులు ఆపేస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా.. కార్లు,బస్సులను హోటల్స్ ఉండే ప్రాంతంలో ఆపేస్తున్నారు. గరికపాడు చెక్‌పోస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం, జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా వద్ద పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలను ఓవైపు.. బస్సులను మరోవైపు ఆపేశారు. కార్లను బలుసుపాడు మీదుగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు మళ్లిస్తున్నారు.
తెలంగాణలో తెరాస హైవే దిగ్బంధం.. రాష్ట్ర సరిహద్దులో వాహనాల నిలిపివేత - ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాల ఆపివేత
Police Alert At AP TS Border: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై తెరాస చేపట్టిన హైవే దిగ్బంధన కార్యక్రమంతో.. రాష్ట్రంలోని సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద హైవే దిగ్బంధం చేయడంతో.. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాలను సరిహద్దుల్లోనే పోలీసులు ఆపేస్తున్నారు.
Police Alert At AP TS Border