ప్రభుత్వం తితిదే ఆస్తుల విక్రయాలను వెంటనే నిలిపివేసి... భక్తులు శ్రీవారికి కానుకగా ఇచ్చిన ఆస్తులు పరిరక్షించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. అంత ఖరీదైన భూములను అతిచౌకగా అమ్మేయాలనుకోవటం వెనుక ఉన్న ఎజెండా ఏమిటో ఇప్పటికే ప్రజలకు అర్ధమయ్యిందని చెప్పారు.
అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని బహిరంగ మార్కెట్లో రేటు తగ్గించి స్వీట్ దుకాణాల్లో అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకోవడాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆలయ మర్యాదలు, కట్టుబాట్లు, ఆగమశాస్త్ర విలువలు తెలియని వైవి సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్ పదవిలో ఉండటానికి అర్హుడు కాదన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు.. గతంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వీడియోలో ఉంచారు.