ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN-HC : సీఐడీ కేసులో స్టే పొడిగింపు - high court

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో ఆరు వారాలు పొడిగించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

సీఐడీ కేసులో స్టే పొడిగింపు
సీఐడీ కేసులో స్టే పొడిగింపు

By

Published : Jan 6, 2022, 5:52 AM IST

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో గతేడాది మార్చి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో ఆరు వారాలు పొడిగించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌. మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఆదేశాలిచ్చారు.

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ వారిరువురూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు... సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details